భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్ళకూరు (మార్చి 07) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు గ్రామం వద్ద జాతీయ రహదారి – 71 పై శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి తిరుపతికి వెళుతున్న గూడూరు డిపోకి చెందిన ఏ పి ఎస్ ఆర్ టీ సీ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని నలుగురికి తీవ్ర గాయాలు కాగా, పదిమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, స్థానిక ఎస్సై నాగరాజు హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను తమ మొబైల్ వాహనంలో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Leave a Reply