భీమ్ న్యూస్ ప్రతినిధి రేణిగుంట (మార్చి 07) తిరుపతి జిల్లా రేణిగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యోగానంద కళాశాల సమీపంలోని ఓ మినీ లారీ డివైడర్ల మధ్యలో రోడ్డు పనులు చేస్తున్న వారిని ఢీకొట్టి డివైడర్ ను దాటి అవతలివైపు రోడ్డులోకి దూసుకెళ్ళింది.ఈ ఘటనలో క్షతగాత్రులైన జిల్లాలోని పెళ్లకూరుమండలం నెల్లబల్లి పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన పలువురు కార్మికులు కట్ల రమణమ్మ (50), ఏడేం సక్కమ్మ, దామతోటి తిరుపాల్ , దామతోటి సుబ్రహ్మణ్యం తదితరులు రోజువారి కూలీలుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో కట్ల రమణమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందగా, దామతోటి తిరుపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణం విడిచారు. ఏడేం సరోజనమ్మ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Leave a Reply