భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (మార్చి 08) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రావూరు గ్రామ పంచాయితీ సుజాతమ్మ నగర్ కాలనీలో టీటీడీ మరియు సమరసతా సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దేవాలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఆలయంలో అమ్మవారిని ప్రతిష్టించి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఉభయ దాతలు ముంగర గోపాల్ మరియు గ్రామస్తులు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. వార్షికోత్సవంలో భాగంగా శ్రీలక్ష్మిదేవి అమ్మవారి వార్షికోత్సవంలో మహా కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వి. వంశీ కృష, బి. చందు, వి. వినయ్, టి. చందు, సీ.హెచ్. శ్యామ్ సుందర్, పి. శివ, సీ.హెచ్. శివ లతో పాటు స్థానిక గ్రామ ప్రజలు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply