భీమ్ న్యూస్ ప్రతినిధి టెక్కలి (మార్చి 08) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బిజెపి పార్టీ మండల అధ్యక్షులు జర్జాన రాంజీ ఆధ్వర్యంలో స్థానిక బాలికల వసతి గృహ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యురాలు డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ అన్ని దానాలు కంటే అవయవాల దానం అతి ముఖ్యమని, ప్రతి ఒక్కరు కూడా అవయవాల దానం పైన అవగాహన కలిగి అవయ దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం అధ్యక్షులు రాంజీ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు పురుషులకి సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని అంటూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు బూరె నరేంద్ర చక్రవర్తి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలకు పెద్దపీట వేయాలని అన్ని రంగాలతో పాటు చట్టసభలలో కూడా 33% రిజర్వేషన్ కల్పించారని, అదేవిధంగా మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో కూడా మహిళలు ముందుకు దూసుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం నాగమణి మాట్లాడుతూ మహిళలు చదువుతో పాటు అన్ని నైపుణ్య వృత్తుల్లో శిక్షణ కలిగి ఉండాలని తెలిపారు. ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు జర్నీ పరమేశ్వరరావు మాట్లాడుతూ నేటి మహిళలు వీరవనితలను ఆదర్శంగా తీసుకొని ధర్య సహసాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు జర్జాన రాంజీ, భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు బూరి నరేంద్ర, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు జర్నీ పరమేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి శాసన పూరి శ్రీను, మండల ఉపాధ్యక్షులు ఉమాబాబు, బిజెపి సీనియర్ నాయకులు నెటింటి రాజారావ, బిజెపి మహిళ నాయకులు నాగమణి, వసతి గృహం వార్డెన్ విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply