భీమ్ న్యూస్ ప్రతినిధి పలమనేరు (మార్చి 11) చిత్తూరు జిల్లా పలమనేరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. రఘువీరారెడ్డి కాలనీలో విద్యార్థుల మధ్య గొడవ చెలరేగింది.ఈ మేరకు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో స్టూడెంట్స్కు స్థానికుల మధ్య సైతం ఘర్షణ జరిగింది. దీంతో విద్యార్థులపై స్థానికులు దాడి చేశారు. అయితే ఈ దాడి సమాచారం తెలుసుకుని గ్రామానికి వెళ్లడంతో పోలీసులుపైనా కాలనీవాసులు తిరగబడ్డారు.
ఈ క్రమంలో కాలనీవాసులకు, పోలీసులకు మధ్య సైతం వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోసారి ఘర్షణలు చెలరేగకుండా ప్రతిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఘర్షణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Leave a Reply