భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుమల (మార్చి 11) తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో గంటసేపటికి పైగా ఎడతెరిపిలేకుండా వర్షం పడటంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.కొద్ది రోజులుగా ఎండలు భరించలేని స్థాయికి చేరుకున్నప్పటికీ, ఒక్కసారిగా వర్షం పడటంతో వాతావరణం మారిపోయింది. వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం :
తిరుపతి, చిత్తూరు, నాయుడుపేట, రేణిగుంట, వరదయ్యపాళెం, తవణంపల్లె వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రముఖ మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తిరుపతిలోని మాడ వీధులు, రైల్వే స్టేషన్ ప్రాంతాలు, బస్టాండ్ ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
భక్తులకు సూచనలు – అధికారులు అప్రమత్తం :
తిరుమలకు వెళ్లే భక్తులు వాతావరణ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా కొండపై కొన్నిచోట్ల చిన్న చిన్న పొరలు విరిగిపడినట్లు సమాచారం. వర్షం కొనసాగితే ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు.
Leave a Reply