భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (మార్చి 11)
తిరుపతిలో ఉన్న మినర్వా గ్రాండ్ హోటల్ లో సీలింగ్ కుప్పకూలింది.హోటల్ గదిలో ఉన్న గది నెంబర్ 314లో పీవోపీతో చేసిన సీలింగ్ ఊడిపడింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘట గురించి తెలియగానే పోలీసులు రంగంలోకిదిగారు .
హోటల్ లో ఉన్న భక్తులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఆ తర్వాత హోటల్ ను కూడా సీజ్ చేశారు. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Leave a Reply