భీమ్ న్యూస్ ప్రతినిధి బొబ్బిలి (మార్చి 13) ఏపీలోని విజయనగరం జిల్లాలో బొబ్బిలి మండలంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఓ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదవడం లేదని, చదువులో వెనకబడుతున్నారని ఓ హెడ్మాస్టర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వారిని తిడితోనో, కొడితేనో విద్యార్థుల్లో మార్పు వస్తుందని ఆయన భావించలేదని ఈ సందర్భంగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే విద్యార్థులను వరుస క్రమంలో నిలబెట్టి వారి ముందే ఆయన గుంజీలు తీసి ఆవేదన వెళ్లగక్కారు. ఈ ఘటన బొబ్బిలి మండలంలోని పెంట జడ్పీ స్కూల్లో వెలుగుచూసింది. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ రమణ స్వయంగా ఇలా చేయడం అందరినీ షాక్ కు గురి చేసింది. విద్యార్థుల ముందే సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీసి,మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము అంటూ తన బాధను వెల్లడించారు. కాగా, దండించి చదువు చెప్పే కాలం ఇది కాదని.. కొడితే, తిడితే పేరెంట్స్ నుంచి ఒత్తిడి, చదువులో రిజల్ట్ రాకపోయినా వారి నుంచి, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి భరించలేకపోతున్నామనే కారణంతో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇలా చేసి ఉంటారని ఉపాధ్యాయ లోకం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది మరి..!
Leave a Reply