భీమ్ న్యూస్ ప్రతినిధి చిత్తూరు (మార్చి 13) చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గం సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తండ్రి జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు చెక్కులను పంపిణీ చేశారు. చిత్తూరు రూరల్ మండలం బీఎన్ఆర్ పేటకు వి.చెన్నకేశవులు శెట్టి రూ.38,914, నాయని చెరువుకు చెందిన కె.లోకేష్ రూ.3.27లక్షలు, గుడిపాల మండలం 189కొత్తపల్లి కి చెందిన ఎస్.లలిత రూ.1.12లక్షలు, చిత్తూరుకు చెందిన ఎం.చిన్నమ్మ -రూ.3.17లక్షలు చెక్కులను అందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Leave a Reply